పోలీసు ట్రాన్స్ పోర్టు విభాగంలో అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్ట్
పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి(టీఎస్ఎల్ఆర్‌పీబీ) తెలిపింది.
హైదరాబాద్: పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి(టీఎస్ఎల్ఆర్‌పీబీ) తెలిపింది. వీరితోపాటు విపత్తు నిర్వహణ, ఫైర్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక పరీక్ష పూర్తయి దేహధారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్ గ్రౌండ్స్‌లో వీరికి మార్చి 2 నుంచి 23 వరకు ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. www.tslrpb.in వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఏవైనా సమస్యలు తలెత్తితే [email protected] కు గానీ, 9393711110 లేదా 9391005006 నెంబర్ కు గానీ సమాచారం ఇవ్వాలని సూచించింది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సంతకం చేసిన దేహధారుఢ్య పరీక్ష ఉత్తీర్ణత ధృవీకరణ పత్రం, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వాటి ప్రతులను తీసుకురావాలని నియామక బోర్డు పేర్కొంది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ అనంతరం ఆర్ఎఫ్‌డీ బ్యాండ్ ను చేతికి ఇస్తామని తెలిపారు.
కాగా, అడ్మిట్ కార్డు రెండు విభాగాలుగా ఉంటుంది. పై భాగంలో అభ్యర్థి వివరాలు, పరీక్ష సమయం, వేదిక, సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఉంటాయి. దీనిని నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. కింది భాగాన్ని చెకప్ స్లిప్ గా సంబంధిత అధికారి పరీక్షా కేంద్రంలో రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకుంటారు.












Click it and Unblock the Notifications