TS DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త... దరఖాస్తు గడువు పొడిగింపు..
డీఎస్సీపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ డీఎస్సీ దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2, 2024 తో దరఖాస్తు గడువు ముగియగా, అభ్యర్థుల విన్నపం మేరకు ఈ తేదీని పొడిగించారు. తాజాగా, జూన్ 20 రాత్రి 11.50 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాదు, పరీక్ష తేదిని కూడా ప్రకటించారు. డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో జులై 17 నుంచి 31 వరకు జరగనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో మొత్తం 11,062 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి. ఇక, ఈ డీఎస్సీ పరీక్షలకు మార్చి 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో డీఎస్సీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆ అభ్యర్థులకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది.

పదిరోజులపాటు జరగనున్న డీఎస్సీ పరీక్షలు...
డీఎస్సీ పరీక్షలు మొత్తం పది రోజులపాటు జరగనున్నాయి. జూలై 17వ తేది నుంచి 31 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు స్కూల్ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న క్రమంలో వేర్వేరు తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇటీవలే టిఎస్ టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. వీటికి మార్చి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 10వ తేదీతో దరఖాస్తులు ముగియనున్నాయి. వచ్చే నెల 20 వ తేదినుంచి టిఎస్ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని టిఎస్ విద్యాశాఖ ప్రకటించింది. టెట్ పరీక్షలు జూన్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఇతర వివరాల కోసం అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications