TS EAPCET 2024: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం-ఇలా అప్లై చేసుకోండి..!
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఈఏపీసెట్(పాత పేరు ఎంసెట్)దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తమ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఏప్రిల్ 6 వరకూ అధికారిక వెబ్ సైట్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇతర వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించాలని ఉన్నత విద్యామండలి సూచిస్తోంది.
తెలంగాణ ఈఏపీసెట్ కోసం అర్హులైన విద్యార్ధులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.acలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది మే 9, 10 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్ పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ పేపర్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి.

టీఎస్ఈఏపీసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ ప్రక్రియలో ఏవైనా పొరబాట్లు చేస్తే .. దిద్దుబాట్ల కోసం ఉన్నత విద్యామండలి దరఖాస్తు గడువు పూర్తయ్యాక అంటే ఏప్రిల్ 8న ఎడిట్ విండో ఓపెన్ చేస్తుంది. ఇది ఏప్రిల్ 12 వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌లను మే 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈఏపీసెట్ దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది.
TS EAMCET అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.acను సందర్శించాలి.
హోమ్‌పేజీలో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
కొత్త లాగిన్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి
ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి
తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి
అనంతరం డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.












Click it and Unblock the Notifications