TS: టెట్ అభ్యర్థులకు శుభవార్త.. దరఖాస్తు గడువు పొడిగింపు..!
టెట్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిన్నటితో అంటే ఏప్రిల్ 10 వ తేదితో దరఖాస్తు గడువు ముగియగా, ఆ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వ తేదివరకు పెంచింది. దీంతోపాటు దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కూడా కల్పించింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం అభ్యర్థులకు మరో అవకాశం కల్పించింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఏప్రిల్ 11 నుంచి 20 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసింది.

ఏప్రిల్ 11 నుంచి 20 వరకు...
అయితే, ఏప్రిల్ 9వతేది నాటికి మొత్తం 1,93,135 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేపర్-1కు 72,771 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కు 1,20,364 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ఏప్రిల్ 11 నుంచి 20 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. గత సంవత్సరం సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో పోల్చితే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి.
వచ్చే నెల 20నుంచి టెట్ పరీక్షలు..
మే 20వ తేదినుంచి టీఎస్ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జూన్ 3 వరకు కొనసాగుతాయి. రోజుకు రెండు సెషన్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1 పరీక్ష జరగగా, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. టెట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డ్‌లను ఏప్రిల్ 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. టీఎస్ టెట్ పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. సందేహాల కోసం అభ్యర్థులు నేరుగా ఈ నెంబర్లను 7075701768, 7075701784 సంప్రదించవచ్చు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications