TS ICET 2024 and TS EAPCET 2024 : తెలంగాణ ఐసెట్, ఎంసెట్ పరీక్ష తేదీల మార్పు..!
తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్( TS ICET 2024) తో పాటు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపీసెట్ (TS EAPCET 2024) పరీక్షల షెడ్యూల్స్ లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా తాజా షెడ్యూల్ ఫాలో కావాలని అధికారులు కోరారు.
తెలంగాణలో గతంలో ఉన్నత విద్యామండలి ఐసెట్ కోసం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాటిని జూన్ 5, 6కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ఈ మార్పు చేయక తప్పలేదు. కౌంటింగ్ పూర్తయిన తర్వాతి రెండు రోజుల్లో ఐసెట్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది.

అలాగే ఎంసెట్/ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎంసెట్ పరీక్షల్ని మే నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఎన్నికల పోలింగ్ కు రెండురోజుల ముందు అధికారులు ఏర్పాట్ల బిజీగా ఉంటారు కాబట్టి ఆ తేదీల్ని కూడా మార్చారు. తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎంసెట్ పరీక్షల్ని ముందుకు జరిపి మే 7 నుంచి 11వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఫలితాలు మాత్రం పరీక్షల తర్వాత ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications