టిఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం..
టిఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదలయ్యింది. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలంగాణ సెట్ - 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇక, ఈ ఏడాది తెలంగాణ సెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక, వీటికి మే 14వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ అధికారిక http://telanganaset.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 2 చివరితేది. ఆలస్య రుసుముతో జూలై 26వ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆగస్టు 28 నుంచి టిఎస్ సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 31వ తేదీతో సెట్ పరీక్షలు ముగుస్తాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు ఆగస్టు 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. తెలంగాణ సెట్ పరీక్ష 2పేపర్లు ఉంటుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఈ పేపర్ అందరికీ ఒకేలా ఉంటుంది. పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు ఉంటుంది.

పరీక్ష విధానం..
పేపర్-1 లో జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్. పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై పరీక్ష ఉంటుంది. ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో నెగెటివ్ మార్కులు ఉండవు.












Click it and Unblock the Notifications