TS TET 2024: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తులు.. తప్పుల సవరణకు అవకాశం..
టీఎస్ టెట్ దరఖాస్తుల గడువు నేటితో (ఏప్రిల్ 20) ముగియనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీనే ముగియాల్సి దరఖాస్తు గడువు ముగియగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 20 వరకు గడువును పొడిగించారు.
ఇక, మరోసారి టెట్ గడువు పెంచే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కాబట్టి, అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. టెట్ పరీక్షలు వచ్చే నెల 20 వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్‌లో ఎడిట్ ఆప్షన్...
ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు సవరణ అవకాశం కల్పించింది విద్యాశాఖ. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వెబ్ సైట్‌లో ఎడిట్ ఆప్షన్ ను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎడిట్ ఆప్షన్‌ను ఉపయోగించుకోని వెంటనే దరఖాస్తు సవరణ చేసుకోవాలని, ఈ గడువు కూడా ఈనెల 20వ తేదీతోనే ముగుస్తుందని చెప్పారు. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మరోసారి ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉందని అధికారులు వివరించారు.
టెట్‌కు అప్లయ్ చేయు విధానం..
ముందుగా టెట్ రాసేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లండి. అందులో పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చెల్లిస్తేనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హోంపేజీలో కనిపించే Application Submission అనే లింక్ పై క్లిక్ చేయాలి. అక్కడ అభ్యర్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సరైన సమాచారం ఇస్తే ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను ఫిల్ చేశాక చివరిలో సబ్మిట్ బటన్ పై నొక్కితే దరఖాస్తు పూర్తి అవుతుంది. అనంతరం
'Print Application' అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు కాపీనీ డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications