తెలంగాణలో ఉద్యోగాలు: టీఎస్‌సీఏబీలో 40 కీలక పోస్టుల కోసం అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. టీఎస్‌సీఏబీ శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరు దరఖాస్తులను ఆహ్వానించింది.
మేనేజర్(స్కేల్-1): 27 పోస్టులు
స్టాఫ్ అసిస్టెంట్: 13 పోస్టులు
అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ డిగ్రీ(కామర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతోపాటు తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి.

వయో పరిమితి:
01.09.2022 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
మేనేజర్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్) ఆధారంగా జరుగుతుంది.
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్) ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
రూ. 950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ. 250)
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2022
దరఖాస్తు రుసుము చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2022
ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2022












Click it and Unblock the Notifications