తెలంగాణ ఎస్సై తుది ఫలితాలు, అభ్యర్థుల జాబితా విడుదల: ఇదిగో లింక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు వచ్చేశాయి. కీలక కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(TSLPRB) తాజాగా ఆదివారం సాయంత్రం ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి 554 ఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. కాగా, గత సంవత్సరం ఆగస్టు 7న ప్రాథమిక రాత పరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

ఫలితాల జాబితా వెలువరించడంతో ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆరా తీయనుంది. గరిష్టంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్ విభాగంతో విచారణ జరిపించిన అనంతరం క్లీన్‌చిట్ ఉన్న అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది.
కాగా, తాజాగా ఎంపికైన అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్, ఇతర ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో ఆగష్టు 9 నుంచి ఆగష్టు 11 వరకు ఆన్‌లైన్‌లో పూరించాల్సి ఉంటుంది. ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు ఇలా అన్ని విభాగాలకు పంపించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే ఎస్సై పోస్టులకు అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేస్తుంది.
అభ్యర్థుల తుది జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
-
నెలకు రూ.55,932 జీతంతో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే ?? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications