తెలంగాణలో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ప్రకటన

తెలంగాణలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన పలు పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన పలు పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. వ్యవసాయ అధికారి నియామక పరీక్ష ఏప్రిల్‌ 25న నిర్వహించనున్నట్లు పేర్కొంది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షను మే 7న, పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష మే 13న నిర్వహించనున్నారు.

ఇక, ఇంటర్‌ సాంకేతిక విద్యాశాఖలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి మే 17న, ఇంటర్‌ కమిషనరేట్‌లో లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి 17న నిర్వహించనున్నట్లు చెప్పింది. అయితే, పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

TSPSC announces dates of several posts recruitment exams

18 డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకానికి గత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు 247 లెక్చరర్ల పోస్టులకు, సాంకేతిక విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ 37, ఇంటర్మీడియట్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ 91 పోస్టులు, ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి డిసెంబర్ నెలలో వేర్వేరుగా టీఎస్‌పీఎస్పీ నోటిఫికేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+