TSPSC AO Result 2024 : టీఎస్ అగ్రికల్చరల్ ఆఫీసర్ రిజల్ట్ వచ్చేసాయ్...
తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీబీపీవో), డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపిక వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఈ నేపథ్యంలో వివాదాలు లేని రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన తుది కీని ఇటీవల విడుదల చేసింది. మెరిట్ ప్రకారం జనరల్ ర్యాంకింగ్ జాబితాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ సంప్రదించగలరు.

148 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ : టిఎస్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 28, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అగ్రికల్చర్ బీఎస్సీ అర్హత ఉన్నవారు మాత్రమే అప్లయ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 10, 2023వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జనవరి 30 వరకు అభ్యర్థులు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక, ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో పరీక్ష జరిగింది. ఏప్రిల్ 2023లో పరీక్షను నిర్వహించారు. ఈ పోస్టుల ఫలితాలను తాజాగా శుక్రవారం నాడు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications