Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TSPSC : గ్రూప్ 1 ప‌రీక్ష వాయిదాపై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం...

తెలంగాణ‌లో ఈ నెల 9వ తేదీన జ‌ర‌గ‌నున్న గ్రూప్ 1 ప‌రీక్ష‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్ 1 ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌లేమ‌ని హైకోర్టు తేల్చిచెప్పింది. జూన్ 9వ తేదిన కేంద్ర‌ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్ గ్రేడ్ 1, ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు స్క్రీనింగ్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. దీంతో రాష్ట్రంలో జ‌రిగే గ్రూప్ 1 ప‌రీక్ష‌ను వాయిదా వేసేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాలంటూ ఎం గ‌ణేష్‌, భూక్యా భ‌ర‌త్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్ పుల్లా కార్తీక్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష వాయిదా వేయ‌డానికి నిరాక‌రించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. మార్చి 23 వరకు తప్పుల సవరణలకు అభ్య‌ర్థుల‌కు అవకాశం కల్పించారు. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన, గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించనున్న‌ట్లు అధికారులు ముందుగానే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

TSPSC High Court s key decision on Group 1 test postponement

ఈ పరీక్ష కోసం సుమారు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ వివ‌రించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా, ఈ ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటూ కొంద‌రు అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు వేశారు. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష వాయిదా వేయమ‌ని ఆదేశించలేమంటూ హైకోర్టు తేల్చిచేప్పేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+