Mega Job Mela : నాగార్జున యూనివర్శిటీలో నేడు,రేపు మెగా జాబ్ మేళా-100 సంస్ధలు-10 వేల ఉద్యోగాలు
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత కోసం వైసీపీ మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఇప్పటికే గతేడాగది వరుసగా పలు ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించిన వైసీపీ.. ఈసారి గుంటూరులో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా జరుగుతోంది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ఈ జాబ్ మేళా జరగనుంది.
నాగార్జున యూనివర్శిటీలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు వివిధ రంగాలకు చెందిన మదాదాపు 100 సంస్ధలు తరలివస్తున్నాయి. ఇవి దాదాపు 10 వేల ఉద్యోగాల కల్పనకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో పదో తరగతితో మొదలుపెట్టి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్హతలతో పలు ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో పాల్గొని ఉద్యోగాలకు ప్రయత్నాలు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

ఏపీ ఉపాధి శిక్షణ శాఖ సహకారంతో వివిధ ప్రైవేటు సంస్ధలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇవాళ, రేపు జరిగే మేళాలో ఎంపికైన అభ్యర్ధులకు నేరుగా ఉద్యోగాలు కల్పించేందుకు ఆయా సంస్ధలు సిద్ధమయ్యాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. గతంలో జరిగిన మెగా జాబ్ మేళాల తరహాలోనూ దీన్ని విజయవంతం చేసేంందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ప్రారంభమైన జాబ్ మేళాలో పాల్గొనే సంస్ధలు అత్యధికంగా ఏడాదికి 8.5 లక్షల వేతనాన్ని కూడా ఆఫర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నైకు చెందిన సిటిజన్ ఫర్ ఛేంజ్ సంస్ధ ఈ జాబ్ మేళాను సమన్వయం చేస్తున్నట్లు వీసీ రాజశేఖర్ తెలిపారు.












Click it and Unblock the Notifications