Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UGC NET 2024 : యూజీసీ నెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌..

యూజీసీ నెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్2024 అడ్మిట్ కార్డ్‌ల‌ను విడుదల చేసింది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులంద‌రూ నెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ అడ్మిట్‌కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. విద్యార్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఎంట‌ర్ చేసి హాల్‌టిక్కెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. అభ్య‌ర్థులు ugcnet.nta.ac.in ఈ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకున్నాక అభ్యర్థులు వారి సంబంధిత హాల్ టికెట్ ఐడీలో ఇచ్చిన సమాచారాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.

యూజీసీ నెట్ 2024 పరీక్ష ఆగస్టు 21వ తుదినుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఉంటుంది. ఇందులో మొత్తం 83 సబ్జెక్టులగాను ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి షిప్టు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జ‌ర‌గ‌గా, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇక‌, కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఆగస్టు 26న జరగాల్సిన పరీక్షను ఆగస్టు 27కు వాయిదా వేసిన‌ట్లు యూజీసీ నెట్ పేర్కొంది. నిజానికి, యూజీసీ నెట్ ప‌రీక్ష ద్వారా ఇండియ‌న్ యూనివ‌ర్సిటీల్లో, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా భోదించేందుకు అర్హ‌త సాధిస్తారు.

UGC NET 2024 Alert for UGC NET Candidates Release of Admit Cards

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేయు విధానం..

అభ్య‌ర్థులు ముందుగా ఎన్‌టిఎ ugcnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌లో హోమ్‌పేజీలో UGC NET 2024 అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. ఆ లింక్‌ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత వెంట‌నే మీ స్క్రీన్‌ పై అడ్మిట్‌కార్డు డిస్‌ప్లే అవుతుంది.

అడ్మిట్‌కార్డున్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్ర‌తి అభ్యర్థి ప‌రీక్ష‌కు వెళ్లే ముందు యూజీసీ నెట్ అడ్మిట్‌కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+