UGC NET-2025 ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC-NET 2025 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీపికబురు ప్రకటించింది. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF పొందేందుకు.. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హత సాధించేందుకు UGC-NET పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 2025 సెషన్ లోని పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఎన్టీయే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం UGC-NET 2025 పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు NTA స్పష్టం చేసింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం సబ్జెక్టుల వారీ పరీక్ష తేదీలను ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రతి అభ్యర్థి తమకు కేటాయించిన సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్ష తేదీ, షిఫ్ట్‌ను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించింది. ఏవైనా మార్పులు, అప్‌డేట్స్ ఉన్నా అవి కూడా అధికారిక వెబ్‌సైట్ ద్వారానే వెల్లడిస్తామని NTA తెలిపింది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)..
UGC-NET పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్‌లైన్ మోడ్‌లో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు ముందు CBT విధానానికి అలవాటు పడేందుకు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. షిఫ్ట్-1 ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులకు ఏ షిఫ్ట్‌లో పరీక్ష ఉందన్న సమాచారం అడ్మిట్ కార్డులో స్పష్టంగా పేర్కొంటారు.
పరీక్షకు కొన్ని రోజుల ముందు UGC-NET అడ్మిట్ కార్డును ఎన్టీయే విడుదల చేయనుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసి, అందులోని పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్ వివరాలను పరిశీలించుకోవాలి. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి అనుమతించరు.
అలాగే పరీక్ష రోజున చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్, అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని ఎన్టీయే సూచించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించండి. UGC-NET పరీక్షకు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్స్, నోటిఫికేషన్లు, సబ్జెక్ట్ వైజ్ షెడ్యూల్, అడ్మిట్ కార్డు సమాచారం కోసం అభ్యర్థులు ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications