UGC-NET డిసెంబ‌ర్ 2024 నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది..జ‌న‌వ‌రిలోనే ప‌రీక్ష‌లు..

నెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. తాజాగా యూజీసీ నెట్ డిసెంబ‌ర్ 2024 పరీక్ష షెడ్యూల్‌ను వెల్ల‌డించింది. ఈ మేర‌కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ ప్ర‌క‌ట‌నను కూడా విడుద‌ల చేసింది. అర్హ‌త, ఆసక్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ నెల (న‌వంబ‌ర్) 19వ తేది నుంచి వ‌చ్చే (డిసెంబ‌ర్‌) నెల 10వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోగ‌ల‌రు. యూనివ‌ర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్ర‌వేశాల‌కు, జేఆర్ఎఫ్ అవార్డు కోసం ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. నెట్ ప‌రీక్షను యూజీసీ ప్ర‌తిఏటా రెండుస్లారు నిర్వ‌హిస్తోంది. జూన్‌లో ఓసారి, డిసెంబ‌ర్‌లో ఓసారి ఈ ప‌రీక్ష‌లు ఉంటాయి. తాజాగా డిసెంబ‌ర్ 2024 నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

యూజీసీ నెట్ డిసెంబ‌ర్ 2024 ప‌రీక్ష‌లు వ‌చ్చే ఏడాది (2025) జనవరి 1వ తేది నుంచి 19వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ ప‌రీక్ష‌లు ఉంటాయి. సిబిటి విధానంలోనే నెట్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. అయితే, ఆన్‌లైన్‌ ప‌రీక్ష‌ల నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించించారు.

UGC-NET December 2024 notification has arrived Exams in January itself

విద్యార్హ‌త : కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు వ‌చ్చి ఉండాలి.

వ‌య‌సు : జేఆర్‌ఎఫ్ రాయాల‌నుకునేవారికి 01.01.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి ఏమీ ఉండ‌దు.

పరీక్ష విధాన‌మిదే..

యూజీసీ నెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌-1లో 50 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. పేపర్‌-2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. పరీక్ష స‌మ‌యం 3 గంటలు. మొద‌టి పేప‌ర్‌లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్య‌మాల్లోనే ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలివే..

దరఖాస్తులు ప్రారంభం : 19-11-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024
దరఖాస్తు సవర‌ణ తేదీలు: 12, 13-12-2024
పరీక్ష తేదీలు: 01-01-2025 నుంచి 19-01-2025 వరకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+