నేటి నుంచి మూడు రోజుల పాటు యూజీసి నెట్ పరీక్షలు...
అసిస్టెంట్ ప్రొఫెసర్ ,జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్షలు నేటి నుంచి అంటే బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించననున్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు గాను ఈ పరీక్షలు ఉంటాయి. రెండు షిప్టుల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) తెలిపింది. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం వరకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌తోపాటు https://ugcnet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా తమ హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టిఎ వివరించింది.
యూజీసి నెట్ నిర్వహించే ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే ఉంటాయి. కంప్యూటర్ ఆధారితంగా (CBT) ఈ పరీక్షలను నిర్వహిస్తారు. యూజీసి నెట్‌లో మంచి స్కోర్ సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (Junior Research Fellowship), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది.

150 ప్రశ్నలు...300 మార్కులు : ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట సమయం, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్ అందరికి కామన్‌గా ఉంటుంది.
ఇక, పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.












Click it and Unblock the Notifications