Union Budget 2025: ఐఐటీ, మెడికల్ సీట్లు భారీగా పెంపు-ఆర్థికమంత్రి కీలక ప్రకటన..!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా దేశంలో విద్యారంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఉన్నత స్థాయి విద్యాసంస్థలైన ఐఐటీలు, మెడికల్ కాలేజీల్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లను భారీగా పెంచబోతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. దీంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటును ప్రకటించారు.

ఏఐకి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఐఐటీలు, మెడికల్ కాలేజీల్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐఐటీలను విస్తరించనున్నట్లు తెలిపారు. 2014 తర్వాత ప్రారంభించిన ఐదు ఐఐటీల్లో మరో 6500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికి అదనపు మౌలిక సదుపాయాలు అందిస్తామని తెలిపారు. ఇందులో ఐఐటీ పాట్నాలో హాస్టల్, మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

Union Budget 2025 Nirmala Sitharaman announces increase of seats in IITs Medical Colleges

గత పదేళ్లలో 23 ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 100 శాతం పెరిగి 65వేల నుంచి 1.35 లక్షలకు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే వైద్య విద్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

గత పదేళ్లలో దాదాపు 1.1 లక్షల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంచామని ఆర్ధికమంత్రి తెలిపారు. ఇప్పుడు వైద్యరంగంలో మౌలిక సదుపాయాల్ని పటిష్టం చేసేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచబోతున్నట్లు తెలిపారు. ఇందులో వచ్చే ఏడాదిలోనే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 10వేల అదనపు సీట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+