IES, ISS రిజల్ట్స్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

యూపీఎస్సీ అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES).. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారికంగా ఈ రిజల్ట్స్ విడుదల చేసింది. అభ్యర్ధులు వారి ఫలితాలను https://upsc.gov.in/index.php అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఎంపికైన అభ్యర్థుల రోల్ నెంబర్లు PDF ఫార్మాట్‌లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫలితాల వివరాలను అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో జూన్ 20 నుంచి 23 వరకు నిర్వహించారు. ఇప్పుడు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ అసలైన సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సకాలంలో సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూకు సంబంధించిన తేదీలు, సమయాలు, ఇతర వివరాలు వచ్చే రెండు వారాల్లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించనున్నారు.

union-public-service-commission-released-ies-and-iss-results

ఇక ఇంటర్వ్యూకు ముందుగా, అర్హతలు పరిశీలించేందుకు అభ్యర్థులు Detailed Application Form (DAF) ఫారం నింపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తేదీలు త్వరలో వెల్లడవుతాయి. ఈ పరీక్షల ద్వారా కేంద్ర ఆర్థిక శాఖలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం UPSC వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

IES విభాగంలో పౌల్సీ ఫార్ములేషన్, మానిటరింగ్, రీసెర్చ్, తదితర బాధ్యతలు ఉండగా.. ISS విభాగం‌లో డేటా విశ్లేషణ, అంచనాలు, స్టాటిస్టికల్ రిపోర్టులు తయారు చేయడం వంటి కీలక పనులు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+