యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్: 200కుపైగా పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 261
పోస్టుల వారీగా ఖాళీలు:
ఎయిర్ వర్డీనెస్ ఆఫీసర్: 80
ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్: 40
లైవ్ స్టాక్ ఆఫీసర్: 06
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 86
అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్-1: 03
అసిస్టెంట్ సర్వే ఆఫీసర్: 07
ప్రిన్సిపల్ ఆఫీసర్: 01
సీనియర్ లెక్చరర్: 06

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ర్రికూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ. 25, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తునకు చివరి తేదీ: జులై 13, 2023.
నోటిఫికేషన్, దరఖాస్తు తోపాటు మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications