VCBL PO Recruitment 2024 : వీసీబీఎల్‌లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే, ఈ నోటిఫికేషన్ మీ కోసమే..విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డిగ్రీ అర్హతతో జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీసిబిఎల్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈపోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోగలరు. వీటికి ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు జనవరి 28 చివరితేదిగా పరిగణించడమైనది.
వీసిబిఎల్‌లో డిగ్రీ అర్హతతో పీవో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం డిగ్రీ పాసయి ఉంటే చాలు నెలకు రూ.20,330 నుంచి రూ.45,590 జీతం అందుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు పరీక్ష ఫీజు రూ. 1000. ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి 2024లో ఉంటుంది. పరీక్ష తేదిని, ఆడ్మిట్‌కార్డులను పరీక్షకు వారం రోజులు ముందుగానే ప్రకటిస్తారు.

ఇతర వివరాలు :
ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్): 30 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి: 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,330 నుంచి రూ.45,590 గా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.1,000.
పరీక్ష కేంద్రాలు: వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 28, 2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను https://www.vcbl.in/ సందర్శించగలరు..












Click it and Unblock the Notifications