నాపై లైంగిక వేధింపులు జరిగాయి.. నిజం బయపెట్టిన 35 ఏళ్ల ప్రముఖ నటి

ప్రముఖ హాలీవుడ్ నటి, హాస్యనటి ఎమిలీ అటాక్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టింది. సెట్స్ మీద, పార్టీలలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, లైంగిక సన్నివేశాల గురించి ఎమిలీ అటాక్ మాట్లాడిన తీరు అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ఈ విషయాలపై రాబోయే రోజుల్లో ఒక డాక్యుమెంటరీ చేయాలని యోచిస్తోంది.

ఇంటిమసీ కోఆర్డినేటర్ల ఆవశ్యకత
ఎమిలీ అటాక్ మాట్లాడుతూ.. "నేను ఇంటమసీ కోఆర్డినేటర్ల గురించి ఓ డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నాను. చాలా మంది దీని అవసరం లేదని భావిస్తున్నారు. కానీ అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ఇంటిమసీ కోఆర్డినేటర్లు నటీనటులకు అండగా ఉంటారు. ముఖ్యంగా అసౌకర్యంగా భావించినప్పుడు వారిని కాపాడతారు. మీటూ ఉద్యమం తర్వాత ఈ విషయంలో మార్పు వస్తోందని, ప్రజలు వినడం ప్రారంభించారు." అని ఎమిలీ అటాక్ అభిప్రాయపడింది.

35-Year-Old Actress Emily Atack Reveals Shocking Truth I Faced Sexual Harassment

'రైవల్స్' సీరియల్‌లో అనుభవం
'రైవల్స్' అనే సీరియల్‌లో ఎమిలీ అటాక్ నటించినప్పుడు ఆమెకు కలిగిన అనుభవాన్ని పంచుకుంది. "నా కెరీర్‌లో నేను ఎప్పుడూ సురక్షితంగా ఉన్నానని భావించలేదు. అయితే 'రైవల్స్' బృందంతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ సీరియల్‌లో చాలా లైంగిక సన్నివేశాలు ఉన్నప్పటికీ.. మా సిబ్బంది ఒకరినొకరు గౌరవించుకుంటూ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించారు. ఇది చాలా సానుకూల విషయం" అని ఎమిలీ అటాక్ పేర్కొంది.

తల్లి పాత్రలో కొత్త అనుభవం
ప్రస్తుతం ఎమిలీ అటాక్ కొత్త సీరియల్ 'ది రూమర్'లో ఒక తల్లి పాత్రను పోషిస్తోంది.ఇది ఆమె జీవితానికి చాలా దగ్గరైన పాత్ర అని ఎమిలీ అటాక్ వెల్లడించింది. కేవలం 10 వారాల క్రితమే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిగా మారిన తర్వాతే ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేయగలిగానని చెప్పుకొచ్చింది. "నేను నా కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత తల్లి పాత్రలో నటించడం చాలా సులభమైంది. అతడిని పాఠశాలకు పంపడం, అతని బ్యాగ్ సరిచేయడం వంటి చిన్న విషయాలను కూడా నేను మనస్ఫూర్తిగా చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకు సొంత కొడుకు ఉన్నాడు. ఈ విషయాలన్నీ చాలా ముఖ్యమైనవి. " అని ఎమిలీ అటాక్ తన అనుభవాన్ని పంచుకుంది.

ఎమిలీ అటాక్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఆమె వ్యక్తిగత అనుభవాలు మాత్రమే కాకుండా.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎంత సాధారణమో సూచిస్తున్నాయి. మీటూ ఉద్యమం తర్వాత కూడా పరిస్థితుల్లో పూర్తి మార్పు రాలేదని.. ఇంకా చాలా మంది వేధింపులకు గురవుతున్నారని ఆమె పరోక్షంగా చెప్పింది. భవిష్యత్తులో నటీనటుల భద్రతకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎమిలీ అటాక్ పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+