ట్రైలర్ కే గుండె జారింది భయ్యో.. ఇక సినిమా చూస్తే..

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఫ్యాన్స్ కు అంతకన్నా ఏం కావాలి.. కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర తమకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి నటించిన '45' మూవీ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఫుల్ హారర్ జోనర్ లో ఉంది. ఈ ట్రైలర్ లో విజువల్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ ఏ సినిమాలో లేని విధంగా అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీలో రాజ్ బి. శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

45 Trailer Out Upendra amp amp Shivarajkumar s Epic Clash Lights Up Screens Releasing Dec 25

రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాలు అంటేనే రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ లు అన్నీ అలాగే ఉంటాయి. తాజాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి రియల్ స్టార్ ఉపేంద్ర ఓ భారీ హారర్ యాక్షన్ మూవీలో నటించారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ట్రైలర్. ఈ మూవీలో ఉపేంద్ర తనదైన శైలిలో మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు శివరాజ్ కుమార్ సైతం మునుపెన్నడూ చేయని గెటప్ లో కనిపిస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ మూవీని డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్రైలర్ చివర్లో పేర్కొంది.

ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ 45 సినిమాను ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకిది తొలి సినిమా కావడం విశేషం. ఈ ట్రైలర్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర అంటే ఆమాత్రం ఉండాలని కామెంట్ పెడుతున్నారు. ఉపేంద్ర అంటేనే డిఫరెంట్ అని అంటున్నారు. సినిమా సూపర్ హిట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఉపేంద్ర.. ఇటీవల రజనీకాంత్ కూలీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడిగా కీలక పాత్రలో మెరిశారు ఉపేంద్ర. అలాగే ఇటీవల తెలుగులో రామ్ పోతినేని హీరోగా చేసిన ఆంధ్రా కింగ్ సినిమాలోనూ హీరో పాత్రలో నటించి మెప్పించారు ఉపేంద్ర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+