నాలుగురోజుల్లోనే 500కోట్లు.. షారుక్ ఖాన్ జవాన్ విధ్వంసం మాములుగా లేదుగా!!
అట్లీ- షారుక్ ఖాన్ కాంబోలో తెరకెక్కిన జవాన్ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే జవాన్ రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల తోనే దుమ్ము రేపింది. నాలుగు రోజుల్లో జవాన్ కలెక్షన్లు 500 కోట్లకు చేరిందంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
అట్లీ షారుక్ ఖాన్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన తొలి నాడే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది జవాన్. దీంతో జవాన్ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది అద్భుతమైన సినిమా అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాని హిట్ చేసిన క్రెడిట్ అంతా షారుక్ ఖాన్ కి దక్కుతుందని అట్లీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు 70 కోట్ల రూపాయలను వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఒక అంచనా.
బాలీవుడ్ చరిత్రలో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రోజునే బిగ్గెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా జవాన్ నిలిచింది. ఈ సినిమాలో షారూక్ ఖాన్ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన జవాన్ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి విధ్వంసం సృష్టిస్తే, వారం రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని భావిస్తున్నారు .
ఇప్పటికే పఠాన్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుక్ ఖాన్, ఇప్పుడు జవాన్ సినిమా తోను వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ కలెక్షన్ల సునామీ ముందు ముందు మరింత కొనసాగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications