'బ్లాక్ లేడీ'ని ముద్దాడిన పుష్పరాజ్!: Filmfare Awards
కేరళలోని కొచ్చి నగరం శనివారం రాత్రి తారల మెరుపులతో మెరిసిపోయింది. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుక అట్టహాసంగా నిర్వహించారు. 2024 సంవత్సరానికి గానూ టాలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమాలతో పాటు, నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించిన నటీనటులను ఈ అవార్డులు వరించాయి.
ఈ వేడుకలో 'పుష్ప 2' తన హవాను చాటుకుంది. 'తగ్గేదే లే' అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. మరోవైపు, వైవిధ్యమైన కథాంశంతో మెప్పించిన '35: చిన్నకథ కాదు' చిత్రానికి గానూ నివేదా థామస్ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకున్నారు. దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి వర్ధమాన నటుల వరకు పలువురు ప్రతిభావంతులు ఈ వేడుకలో బ్లాక్ లేడీని ముద్దాడారు.

70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ (Filmfare Awards) అవార్డులు - టాలీవుడ్ విజేతలు:
| విభాగం | విజేత | సినిమా |
| ఉత్తమ చిత్రం | పుష్ప 2 | పుష్ప 2 |
| ఉత్తమ దర్శకుడు | సుకుమార్ | పుష్ప 2 |
| ఉత్తమ నటుడు | అల్లు అర్జున్ | పుష్ప 2 |
| ఉత్తమ నటి | నివేదా థామస్ | 35: చిన్నకథ కాదు |
| ఉత్తమ సహాయ నటుడు | అమితాబ్ బచ్చన్ | కల్కి 2898 ఏడీ |
| ఉత్తమ సహాయ నటి | అంజలి | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి |
| ఉత్తమ నటుడు (క్రిటిక్స్) | తేజ సజ్జా | హనుమాన్ / మిరాయ్ |
| ఉత్తమ నటి (క్రిటిక్స్) | కాజల్ అగర్వాల్ | సత్యభామ |
| ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) | లక్కీ భాస్కర్ | |
| ఉత్తమ పరిచయ దర్శకుడు | యదు వంశీ | కమిటీ కుర్రోళ్లు |
| ఉత్తమ పరిచయ నటుడు | సందీప్ సరోజ్ | కమిటీ కుర్రోళ్లు |
| ఉత్తమ పరిచయ నటి | నయన్ సారిక | గం గం గణేశా |
| బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ | దేవి శ్రీ ప్రసాద్ | పుష్ప 2 |
| ఉత్తమ గాయకుడు | శ్రీకృష్ణ | గుంటూరు కారం (కుర్చీ మడతపెట్టి) |
| ఉత్తమ గాయని | శిల్పారావు | దేవర (చుట్టమల్లె) |
| ఉత్తమ సాహిత్యం | రామజోగయ్యశాస్త్రి | దేవర (చుట్టమల్లె) |
| బెస్ట్ కొరియోగ్రఫీ | శేఖర్ మాస్టర్ | గుంటూరు కారం (కుర్చీ మడతపెట్టి) |
| బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ | నితిన్ జిహానీ / రామకృష్ణ-మోనిక | కల్కి 2898 ఏడీ / పుష్ప 2 |
Congratulations!
— Filmfare (@filmfare) February 21, 2026
The Filmfare Award for Best Actor in a Leading Role (Male) - Telugu goes to Allu Arjun for Pushpa 2: The Rule at the 70th Filmfare Awards South with Kerala Tourism.
Destination Partner: @KeralaTourism
Special Partner: @KamarFilmfactry
Co-Powered By:… pic.twitter.com/HP5mOrZP7j












Click it and Unblock the Notifications