ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే.. రాజాసాబ్‌లో అసలు ట్విస్ట్ అదే.. మరో వెయ్యి కోట్లు బొమ్మ లోడింగ్ !
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న ప్రభాస్.. నెక్స్ట్ సినిమాలు లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అనే చెప్పాలి. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో 'స్పిరిట్'.. సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు.
ప్రెజెంట్ ఓ పక్క రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో.. బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయాలనే బిజీగా గడుపుతున్నారు. మరో పక్క తన డేట్స్ ని హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాకి కూడా కేటాయిస్తున్నారు. అయితే వరుసగా స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మారుతీతో సినిమా చేయడం ఏంటని సర్వత్రా చర్చ నడుస్తోంది. మారుతీ ప్రభాస్ ని హ్యాండిల్ చేయగలడా ? సినిమా హిట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే రాజాసాబ్ సినిమా కూడా కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుందని ప్రభాస్ ఆయన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. చాలా రోజుల తర్వాత అలాంటి సినిమా చేస్తున్నానని అంటున్నారట. నిజానికి ప్రభాస్ ఫన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్స్ లో కనిపించి చాలా కాలమే అవుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
పాన్ ఇండియా మార్కెట్ ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కానీ రాజాసాబ్ సినిమాలో ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉందట. ఆ ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది అంటూ దర్శకుడు గట్టిగా చెబుతున్నారట. స్క్రిప్ట్ లో చాలా వరకు ట్విస్ట్ లు ఉన్నప్పటికి ఒక్క ట్విస్ట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. చూడాలి మరి మారుతీ ఏ మేరకు మ్యాజిక్ చేస్తాడో అని.
Been counting down the days for this one :)
— Director Maruthi (@DirectorMaruthi) October 23, 2024
Happy Birthday to my Raja Saab #Prabhas ❤️
Darling I might not say much now…..but April 10th will be the day we CROWN THIS MOMENT with the BIGGEST CELEBRATION :) 🤗
Motion poster :https://t.co/FNXdwIJwQ9#HappyBirthdayPrabhas… pic.twitter.com/qpn18SOFVI
ఇక పోతే ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిసన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
-
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!











Click it and Unblock the Notifications