స్నేహమంటే ఇదేనా?... ఎన్టీఆర్ కథను లాక్కున్న స్టార్ హీరో
సినీ పరిశ్రమలో కథలను తయారుచేసేటప్పుడు రచయితకానీ, దర్శకుడు కానీ ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని రాసుకుంటారు. అతని బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథను, స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకుంటారు. కథ వినిపించిన తర్వాత హీరోకు నచ్చకపోవచ్చు.. లేదంటే కొన్ని మార్పుచేర్పులు సూచించవచ్చు.. అలా కాకపోతే కాల్షీట్లు ఖాళీగా లేకపోవడం జరుగుతుంటుంది. దీంతో ఆయా దర్శకులు అదే కథను వేరే హీరోకు వినిపించి సినిమాలు చేస్తుంటారు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తో ఓ దర్శకుడు చేయాల్సిన సినిమాను మరో హీరో చేశారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
రవితేజ కెరీర్ ను మార్చేసింది
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన కిక్ చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ముందుగా ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారు. కథ బాగా నచ్చడంతోపాటు కొన్ని కారణాలవల్ల కొంత సమయం కావాలని అడిగాడు. అంత సమయం వేచిచూడటానికి ఇష్టపడని సురేందర్ రెడ్డి ఆ కథను రవితేజకు వినిపించి ఓకే చేయించుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రవితేజ కెరీర్ మార్చేసిందని చెప్పొచ్చు. అంతటి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను తారక్ చేసుంటే అతని రేంజ్ మరోలా ఉండేదంటున్నారు సినీ విశ్లేషకులు.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా..
అతి తక్కువ వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మధ్యలో సరైన కథలను ఎంచుకోవడంలో తడబడ్డాడు. దీంతో సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచేవి. మార్కెట్ మాత్రం డౌన్ కాకపోవడం విశేషం. టెంపర్ నుంచి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తున్న తారక్ ఇంతవరకు ఈ పది సంవత్సరాల్లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తీయలేదు. అన్నీ సూపర్ హిట్లే తీశాడు. ప్రస్తుతం దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. లాంగ్ రన్ లో రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications