జ్యోతి రాయ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందురోయ్..!

హాట్ హాట్ ఫోజులతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ రెచ్చిపోతుంది బుల్లితెర సుందరి జ్యోతి రాయ్. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రాళ్లను చిత్తు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన తన ఫొటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ హాట్ షోకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. "ఎ మాస్టర్ పీస్" అనే సినిమాలో జ్యోతి రాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది చిత్ర బృందం.

తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, "ఎ మాస్టర్ పీస్" అనే కొత్త కాన్సెప్ట్ సూపర్ హీరో సినిమా రూపొందిస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. 'శుక్ర' , 'మాటరాని మౌనమిది' వంటి విలక్షణమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు పూర్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ తుది దశలో ఉండగా, చిత్ర బృందం మీడియాకు షూటింగ్ వివరాలను వెల్లడించింది.

A Masterpiece A New Telugu Superhero Film with Mythological Roots and Hollywood-Level VFX

పురాణాల స్ఫూర్తితో సూపర్ హీరో కథ
దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ మన పురాణాల నుంచి స్ఫూర్తి పొందిందని తెలిపారు. దశరథ మహారాజు మంత్రి సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్నప్పుడు లభించిన ఒక వరం ఆధారంగా సూపర్ హీరో పాత్రను సృష్టించినట్లు చెప్పారు. అలాగే, హిరణ్యకశ్యపుడికి సంబంధించిన ఒక అంశాన్ని ద్వాపర యుగం నుంచి తీసుకొని సూపర్ విలన్ పాత్రను రూపొందించారు. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాలను కలుపుతూ సాగే ఒక సరికొత్త స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సూపర్ హీరోగా హీరో అరవింద్ కృష్ణ, సూపర్ విలన్‌గా నిర్మాత మనీష్ గిలాడ అద్భుతంగా నటించారని పూర్వాజ్ ప్రశంసించారు. అలాగే, తన సతీమణి, నటి జ్యోతి పూర్వాజ్ పాత్ర కూడా విభిన్నంగా ఉంటుందని చెప్పారు.

హాలీవుడ్ స్థాయి మేకింగ్, వీఎఫ్ఎక్స్
నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ, మలయాళంలో వచ్చిన 'మిన్నల్ మురళీ' స్ఫూర్తితో ఒక మంచి సూపర్ హీరో సినిమాను తెలుగులో తీయాలని ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టామని తెలిపారు. ఈ సినిమా నిర్మాణానికి హై ఎండ్ టెక్నాలజీని వాడుతున్నామని, హాలీవుడ్‌లో కూడా ఉపయోగించని కొన్ని సాంకేతికతలను తమ సినిమాలో ఉపయోగించామని చెప్పారు.

A Masterpiece A New Telugu Superhero Film with Mythological Roots and Hollywood-Level VFX

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యోగి పోసాని మాట్లాడుతూ, షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. క్లైమాక్స్ గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నామని, ఆ భారీతనాన్ని మీడియాకు చూపించాలనే ఈ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. మహా శివరాత్రి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+