బాలీవుడ్ క్వీన్ శ్రీదేవికి అరుదైన గౌరవం: అతిలోక సుందరిపై ముంబైవాసుల ప్రేమకిదే నిదర్శనం!!
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు బాలీవుడ్ లోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది దివంగత నటి, బాలీవుడ్ క్వీన్ శ్రీదేవి. బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన శ్రీదేవి తాను చనిపోయే వరకు అనేక సినిమాలలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని నేటికి జీర్ణించుకోలేని ఆమె అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
శ్రీదేవికి అరుదైన గౌరవం
అటువంటి బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఒక జంక్షన్ కి అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసింది.

జంక్షన్ కు శ్రీదేవి పేరు
శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్ తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషి కపూర్ లు ఇంతకుముందు ఇదే ప్రాంతంలో నివసించారు. అయితే శ్రీదేవి మరణించిన తర్వాత వారి కుటుంబం అక్కడి నుంచి షిఫ్ట్ అయిందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె జ్ఞాపకార్ధం, ఆమెను గౌరవించాలని, ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉండేలా ఆమె పేరు జంక్షన్ కు పెట్టుకున్నారు.
అంధేరీ వెస్ట్ లో శ్రీదేవి నివసించిన ప్రాంత వాసుల నిర్ణయం
ఈ మేరకు సోషల్ మీడియాలో అంధేరీ వెస్ట్ కు చెందిన నగర వాసులు పోస్టులు కూడా పెడుతున్నారు. తమ అభిమాన నటి శ్రీదేవికి శాశ్వతమైన గౌరవాన్ని ఇవ్వగలిగామని శ్రీదేవి లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని గ్రీన్ ఎకర్స్ టవర్ లో నివసించే వారనీ, ఆమె ఇంటికి వెళ్లే మార్గంలోనే ఈ చౌక్ ఉందని చెబుతున్నారు.
Honour To Eternal #Sridevi !!
— BA Raju's Team (@baraju_SuperHit) May 10, 2024
A junction in the Lokhandwala Complex locality of Andheri, Bombay has been named Sreedevi Kapoor Chowk. @BoneyKapoor
The chowk is on the same road on which the late actress lived with husband Boney Kapoor and her two daughters, Janhvi and Khushi,… pic.twitter.com/glhSHl7xRz
శ్రీదేవి కపూర్ చౌక్ పేరు పెట్టిన స్థానికులు
ఇదిలా ఉంటే గతంలో శ్రీదేవి జ్ఞాపకార్థం ముంబైలో ఒక ఫ్లైఓవర్ కి కూడా ఆమె పేరు పెట్టాలని బిజెపి కార్పొరేటర్ యోగిరాజ్ లేఖ రాశారు. అభినేత్రి శ్రీదేవి ఉదాన్ పూల్ పేరు ఫ్లైఓవర్ కి పేరు పెట్టాలని ఆయన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక జంక్షన్ కి ఫైనల్ గా శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications