భార్యను చితకబాది సెంట్రల్ జైలుకు వెళ్లిన స్టార్ హీరో, ఆరోజు చెప్పిన మాట నిజం అయ్యింది
తన భార్య విజయలక్ష్మిపై దాడి చేసిన కేసులో కన్నడ నటుడు దర్శన్ గతంలో 28 రోజుల జైలు శిక్ష అనుభవించాడు. కానీ జైలు నుంచి విడుదలయ్యాక జైలు అధికారులతో వెళ్లి వస్తాను సార్ అని ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆరోజు చెప్పాడు. పాత సామెత ప్రకారం నోటి నుంచి వచ్చిన మాటలు నిజం అవుతాయి అనే సామెతలా ఓ హత్య కేసులో నటుడు దర్శన్ మరో సారి అదే సెంట్రల్ జైలుకు వెళ్లాడు.
సరిగ్గా 13 ఏళ్ల తర్వాత బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలుకు హీరో దర్శన్ తిరిగి వచ్చాడని జైళ్ల శాఖ రిటైడ్ అధికారి అంటున్నారు. హీరో దర్శన్ జైలుకు వెళ్లడంపై మండ్య జిల్లాలో నివాసం ఉంటున్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు రిటైర్డ్ అధికారి సతీష్ ఓ ప్రముఖ కన్నడ టీవీ చానల్ తో మాట్లాడారు. హీరో దర్శన్ తన భార్య విజయలక్ష్మిపై దాడి చేయడంతో 28 రోజులు పరప్ప అగ్రహార జైలులో ఉన్నాడని సతీష్ గుర్తు చేశారు.

ఆ సమయంలో జైలు అధికారిగా ఉన్న సతీష్ మొదట్లో జైలులో ఉన్న నేరగాళ్లతో మమేకం కావడానికి ఇబ్బంది పడిన నటుడు దర్శన్‌కు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత 28 రోజుల్లో జైలు అధికారితో హీరో దర్శన్ కు మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. అయితే జైలు నుంచి విడుదలయ్యాక నటుడు దర్శన్ జైలు అధికారితో ఏం చెప్పాడో అనే విషయం రిటైడ్ జైలు అధికారి సతీష్ చెప్పడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో హీరో దర్శన్ ఒక్క మాట చెప్పాడు. చాలా రోజుల తర్వాత విడుదల చేస్తున్నామని, ఇంకోసారి ఇలా జరగకూడదు అని, మీరు మరోసారి ఇటువైపు చూడకూడదని నేను ఆయనకు చెప్పానని సతీష్ గుర్తు చేసుకున్నారు. అయితే సార్ వెళ్లి వస్తాను అని హీరో దర్శన్ ఆరోజు మాతో అన్నాడని రిటైడ్ జైళ్ల శాఖ అధికారి సతీష్ చెప్పారు. ఆ రోజు జైల్లో దర్శన్ అలా ఎందుకు అన్నారో అని ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యం అయ్యిందని సతీష్ అంటున్నారు.

కానీ హీరో దర్శన్ కు ఎలా చెప్పాలో తెలీక ఆరోజు నేను మౌనంగా ఉండిపోయానని, కానీ ఆయన నోటిమాట మరోసారి ఇప్పుడు నిజం అయ్యిందని సతీష్ అన్నారు. మామూలుగా జైలు నుంచి బయటకు వెళ్తూ పొరపాటున అలా అని ఉంటాడని ఆ రోజు తాను అనుకున్నానని, ఇప్పుడు యాదృచ్ఛికంగా నటుడు దర్శన్ మళ్లీ అదే సెంట్రల్ జైలుకు వెళ్లాడని,ఆసుపత్రులు, జైళ్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరికీ వెళ్లి వస్తాను అని అనకూడదని సతీష్ చెప్పారు.
నటుడు దర్శన్ జైలు నుంచి బయటకు రాగానే ఇక ముందు ఆయన ఇక్కడికి రాకూడదు అని నేను అనుకున్నానని, అయితే అదే జైలుకు మరోసారి ఆయన వెళ్లాడని తెలిసి షాక్ అయ్యానని రిటైర్డ్ జైళ్ల శాఖ అధికారి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వెళ్లి వస్తాను అని చెప్పడం అందరి ఇళ్లలోనూ పరిపాటి. జైలు నుంచి బయటకు రాగానే వెళ్లి వస్తానని ఆరోజు నటుడు దర్శన్ చెప్పడం, ఇప్పుడు చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మరోసారి జైలుకు వెళ్లడంతో ఆయన చెప్పిన మాట నిజమైంది.












Click it and Unblock the Notifications