చిరంజీవి బెడ్ రూమ్ లో ఆ హీరోయిన్ ఫోటో..? ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. అతను కనిపిస్తే ప్రభంజనం.. స్క్రీన్ పై మెరిస్తే అరాచకం, ఆయన డ్యాన్యులు చేస్తుంటే, డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ లో ఉప్పొంగే ఆనందం.. ఇలా ఒక్కటేమిటి ఆయన ఏం చేసినా అభిమానులకు పండగే. ఓ సాధారణ వ్యక్తిగా ప్రారంభం అయిన ఆయన జర్నీ.. 40 ఏళ్లుగా ఎన్నో విజయాలను అందించి.. కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. మరి ఇంత పెద్ద హీరోకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఎంతలా అంటే చిరంజీవి బెడ్ రూమ్ లో కూడా ఆ హీరోయిన్ ఫోటో పెట్టుకున్నాడంటే.. ఆమె అంటే ఆయనకు ఎంత ఇష్టమూ ఇట్టే అర్ధం అవుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి.. తన టాలెంట్, డాన్స్ మూమెంట్స్, నటనతో కోట్లాది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడంతో పాటు సినిమానే ప్రపంచంగా ఇండస్ట్రీకు వచ్చే యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అయితే చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అవును చిరంజీవి బెడ్ రూమ్ లో ఓ హీరోయిన్ ఫొటో ఉందంట.

ఆ హీరోయన్ పోటో కరెక్ట్ గా ఆయన బెడ్ కు ఎదురుగా ఉంటుంది.. ఉదయం లేవగానే ముందుగా ఆమె ముఖాన్ని చిరంజీవి చూస్తారట.. ఇంతకీ ఆమె ఎవరో కాదు మహానటి సావిత్రి. ఈ విషయాన్ని సావిత్రి కూతురు స్వయంగా వెల్లడించారు. ఓ సారి సావిత్రికి సంబంధించిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించడానికి చిరంజీవి ఇంటికి వెళ్లింది సావిత్రి కూతురు విజయ. అప్పుడు చిరు ఆమెతో మాట్లాడుతూ.. నా రూమ్ లో సావిత్రమ్మ ఫొటో ఉంటుంది. ఉదయాన్నే ఆమె ముఖాన్నే నేను చూస్తాను అని చెప్పారట. అంతేకాక మీరు నమ్ముతారో లేదో అని పైన ఉన్న తన బెడ్ రూమ్ నుంచి నుంచి ఆ ఫోటో కూడా తెప్పించి చూపించారట.

చిరంజీవి బెడ్ రూమ్ లో సావిత్రి ఫొటో చూసి ఆనందంగా ఫీల్ అయినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయ. అంటే కాదు చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు కూడా సావిత్రి ఒకసారి చిరంజీవిని పిలిచి మరీ మెచ్చుకుందని పలు వేదికల్లో చిరునే చెప్పారు. ఇక ఇప్పుడు సావిత్రిని చిరంజీవి ఎంతో స్పూర్తిగా తీసుకుంటారు అనేది ఈ కథనం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications