Hanuman: ప్రశాంత్ భయ్యా ఏంటీది.. ఇరగదీశావు పో.. పూనకంతో ఊగిపోతున్నారు..
చిన్న సినిమాగా వచ్చి.. భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది హనుమాన్ మూవీ. మొదట్లో ఈ మూవీకి థియేటర్లే దొరకలేదు.. కానీ ఇప్పుడు ఈ మూవీ నడుస్తున్న ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. హనుమాన్ కలెక్షన్లలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై 15 రోజులు దాటినా.. క్రేజ్ మాత్రం దగ్గడం లేదు కలెక్షన్లూ తగ్గడం లేదు. ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లు వసూలు చేసింది.
ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. హనుమాన్ మూవీ పాన్ ఇండియా వైడ్ నడుస్తోంది. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ఓవర్ సిస్ లో కూడా భారీగా కలెక్షన్లు రాబడుతోంది. హనుమాన్ చిత్రం ఓవరి సీస్ లో 5 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం కోసం ఇప్పటికీ కూడా ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఈ ఊపులో దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి సిక్వెల్ గా జై హనుమాన్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.

హనుమాన్ మూవీ థియేటర్ లో చూస్తే మజానే వేరంటున్నారు అభిమానులు. హనుమాన్ మూవీ సౌండ్ కు సినిమాను థియేటర్స్ లో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ హనుమాన్ సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ సినిమా చూస్తూనే కూర్చిలో ఊగిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
What you have cooked @PrasanthVarma
— AA Cult 🐉🪓 (@1_bunnyfreak) January 29, 2024
You should see this 🙇🙇#HanuMan pic.twitter.com/Ry9KyIA0jA
ఈ వీడియోను ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. మీరు ఏం సినిమా తీశారు ప్రశాంత్ వర్మ.. ఇది చూడండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ తీసిందిగా తెలుస్తోంది. ఈ మూవీతో తేజ సజ్జాకు భారీ గుర్తింపు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఈ మూవీకి టికెట్లలో ఐదు రూపాయాలను అయోధ్య రాముడి ట్రస్ట్ కు విరాళంగా ప్రకటించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications