సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నిహారిక వీడియో..ఇంత దారుణంగానా..?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల... ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల నుంచి బయటపడి, కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. భర్త చైతన్యతో ప్రేమ వివాహం చేసుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న నిహారిక, అనూహ్యంగా పెళ్లైన కొద్ది కాలానికే విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.విడాకుల సమయంలో నెటిజన్ల నుంచి ఘోరమైన ట్రోలింగ్‌ను, విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, నిహారిక కొంతకాలం మౌనం వహించి.. ఇప్పుడు మరింత బలంగా తిరిగి వచ్చారు.

తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా, ఆమె తన దృష్టిని మళ్లీ సినిమా పరిశ్రమ వైపు మళ్లించారు. అయితే ఈసారి నటిగా కాకుండా, పక్కా నిర్మాతగా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం.నిహారిక నిర్మాణ సంస్థ నుంచి తొలి ప్రయత్నంగా వచ్చిన చిత్రం 'కమిటీ కుర్రాళ్లు'. ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నిర్మాతగా తన మొదటి సినిమానే విజయం సాధించడంతో నిహారిక ఆనందానికి హద్దులు లేవు. ఈ అద్భుతమైన ఆరంభం నిహారికలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

A video related to Mega Daughter Niharika has gone viral on social media

తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ మెగా డాటర్ ఆలస్యం చేయకుండా తన రెండో సినిమాను కూడా మొదలుపెట్టారు. సంగీత్ శోభన్‌ను హీరోగా తీసుకుని తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక కొణిదెల , దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మధ్య చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ మూవీ పూజా కార్యక్రమాలకు గెస్ట్‌గా వెళ్లిన నిహారికకు చేదు అనుభవం ఎదురైంది.

అదే కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుతో మెగా డాటర్ మాట్లాడుతుండగా.. ఆయన ఆమె నడుముపై చేతి వేసి దగ్గరకు లాక్కున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలా అసౌకర్యంగా ఫీల్ అయిన నిహారిక వెంటనే ఆయన కూర్చున్న కూర్చీ వెనక్కి వెళ్లి మాట్లాడింది. వీడియోలో క్లియర్‌గా ఆమె ఇబ్బంది పడినట్లు కనిపించడంతో అంతా షాక్ అవుతూ విమర్శలు చేస్తున్నారు. నెక్ట్స్ మూవీలో పనస పండుతో కొట్టాలనుకుంటున్నాడు కావచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. చిన్నప్పటి నుంచి ఆయన చేతిలో పెరిగింది కాబట్టి ఆప్యాయతతో అలా చేసి ఉంటారని మరో వ్యక్తి అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+