స్త్రీకి స్త్రీయే శత్రువు... సమంతే ఇందుకు ఉదాహరణ!?

మొదటి నుంచి కూడా మన సమాజంలో మహిళలకు సంబంధించి ఒక మాట వాడుకలో ఉంటుంది. అదేమిటంటే.. స్త్రీకి స్త్రీయే శత్రువు అని. అది వాస్తవం అని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. పురుషుల్లో ఊహించనిరీతిలో అతి పెద్ద గొడవ జరిగితేనే ప్రత్యర్థులుగా, శత్రువులుగా మారతారు. కానీ మహిళల విషయంలో అలా కాదు.. చిన్న చిన్న విషయాలకు కూడా వీరు శత్రువులవుతారు. అలాంటిది ఒక జీవితానికి సంబంధించిన సంఘటన అయితే వీరు మంచిగా ఏమాత్రం ఉండరు. అందుకు సమంత, రాజ్ నిడుమోరు విషయంలోప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

తప్పంతా సమంతదే అని అర్థమవుతోంది
వెబ్ సిరీస్ లు తీస్తున్న దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేల్లో ఒకరైన రాజ్ నిడుమోరుతో సమంత సన్నిహితంగా ఉందని, డేటింగ్ చేస్తోందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు ఇటువంటి అఫైర్లు అవసరమా? అంటూ ఎంతోమంది సినీ పెద్దలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రెండో పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పిన సమంత అందుకు ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందో అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తన భర్తతో సమంత సన్నిహితంగా ఉండటంపై రాజ్ నిడుమోరు భార్య శ్యామలి సామాజిక మాధ్యమాల్లో తరుచుగా కొన్ని కొటేషన్స్ ను షేర్ చేస్తోంది. అవి చూసిన తర్వాత కూడా సమంత ఏమాత్రం మారడంలేదంటే నాగచైతన్యతో విడిపోవడంలో అతని తప్పేంలేదని, తప్పంతా సమంతదే అని స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు అభిమానులు.

A woman is the enemy of a woman Samantha is an example of this

మరో స్త్రీ మనోవేదనకు కారణమవుతోంది
తాజాగా రాజ్, సమంత దుబాయ్ వెళ్లారు. లండన్ లో చక్కర్లు కొట్టారు. తాజాగా శ్యామలి 'తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి' అంటూ కొటేషన్‌ షేర్ చేసింది. ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్ వెళ్లిన సమంత ఒక వ్యక్తి చేయి పట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. అది కచ్చితంగా రాజ్ నిడుమోరుదే అని అర్థమవుతోంది. మనం నిస్పక్షపాతంగా ఉండాలంటే ఇతరులది ఏదీ సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏదీ మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు అని శ్యామలి పోస్ట్ లో రాసుకొచ్చింది. ఒక స్త్రీ తన భర్తను మరో స్త్రీతో సన్నిహితంగా చూస్తే తట్టుకోగలదా? అనే చిన్న విషయం కూడా సమంతకు తెలియేలేదా? లేదంటే తెలిసి కూడా మొండిగా వ్యవహరిస్తోందా? అనిపిస్తోంది. తనకు కావల్సిందే కావాలని పట్టుబడుతూ మరో స్త్రీ మనోవేదనకు కారణం అవుతోంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+