సూపర్ స్టార్ ఫ్యాన్స్ మీద చిందులు వేసిన మహిళ, వీళ్లకు పనిపాట లేదా, పొంగల్ రోజు ఈ ఖర్మ ?

సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. జైలర్ సినిమా చేసిన తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జై భీమ్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన జ్ఞానవేల్‌ ఇప్పుడు రజనీకాంత్ కొత్త సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. ఈ కారణంగానే అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రజనీకాంత్ సినిమా ఏప్రిల్ లేదా మేలో విడుదల కావచ్చు అని ఆయన అభిమానులు అంటున్నారు.. అంతకు ముందే పొంగల్ పండుగ తమిళ ప్రజలకు చాా ప్రత్యేకం కావడంతో జనవరి 15వ తేదీన (ఈరోజు) వెట్టయన్ సినిమా మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు.

A woman who lives near Thalaivas house in Chennai is furious with Superstar Rajinikanths fans

ఈ ప్రత్యేకమైన సంక్రాంతి పండుగ రోజున రజనీకాంత్ నటించిన వెట్టయన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో గన్ పట్టుకుని స్టైలిష్‌గా నిలబడిన రజనీకాంత్ ఇప్పుడు పొంగల్ పండుగ సందర్బంగా ఆయన న అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు. మళ్లీ మాస్ లుక్‌లో రజనీ తన స్టైల్‌లో కనిపించడం చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. వెట్టయన్‌ సినిమా పోస్టర్‌ విడుదల కావడంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ అభిమానులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయ్యారు.

రజనీకాంత్ కొత్త సినిమా వెట్టయన్ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కూడా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ అతిధి పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో లాల్ సలామ్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెట్టయన్ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఓ వైపు వెట్టయన్ సినిమా పోస్టర్ విడుదల కాగానే పొంగల్ రోజు అయిన సోమవారం సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి ముందు తలైవా అభిమానులు గుమిగూడారు. తన అభిమాన నటుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు కాలినడకన చెన్నైలోని పోయస్ గార్డెన్ లోని ఆయన ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైప రజనీకాంత్ పక్కింటిలో నివాసం ఉండే మహిళ రజనీకాంత్ పై, ఆయన అభిమానులపై మండిపడ్డారు.

అభిమాన హీరో పుట్టినరోజు, పండుగలు, కొత్త సంవత్సరం ఇలా ఏదైనా ప్రత్యేకమైన రోజున రజనీకాంత్ అభిమానులు ఆయన ఇంటి ముందు గుమిగూడుతున్నారు. అభిమాన నటుడితో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూసి ఆనందించడం ఆయన అభిమానులకు చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పొంగల్ కోసం చెన్నైలోని పోయస్ గార్డెన్‌లోని రజనీ ఇంటి ముందు వేలాది మంది అభిమానులు గుమిగూడారు.

దీంతో ఆగ్రహం చెందిన రజనీకాంత్ పక్కింటి మహిళ పెద్ద ఎత్తున కేకలు వేసింది. మేము కూడా చెన్నై కార్పోరేషన్ కు పన్నులు చెల్లిస్తున్నామని, మేము ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నామని, అయితే రజనీకాంత్ అభిమానులు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, దీనికి అంతం లేకుండాపోతా ఉందని ఆ మహిళ మండిపడ్డారు.

రజనీకాంత్ పక్కింటిలో నివాసం ఉండే మహిళ చిందులు వెస్తున్న సమమంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులను రజనీ కలుసుకుని వారికి సంక్రాంతి (పొంగల్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, నీతి నిజాయితీ ఆలోచనతో ఉంటే అందరి జీవితంలో ప్రశాంతత ఉంటుందని రజనీకాంత్ ఆయన అభిమానులకు సూచించారని తమిళ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+