ప్రభాస్‌కు హ్యాండిచ్చిన తెలుగు స్టార్ హీరోయిన్... యంగ్ హీరోతో మ్యారేజ్?
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలపై సినిమాలు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన్ను చూసి మిగతా స్టార్ హీరోలు నేర్చుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నారు. రాజాసాబ్ చేస్తున్న డార్లింగ్ హను రాఘవపూడితో ఫౌజీ చేస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు స్పిరిట్ పట్టాలెక్కబోతోంది. ఆ తర్వాత సలార్2, కల్కి2 పట్టాలెక్కుతాయి. సరైన ప్రణాళిక రచించుకొని వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కృతిసనన్ హీరోయిన్ గా నటించింది సీత పాత్రలో. గ్రాఫిక్స్ చిన్నపిల్లల గ్రాఫిక్స్ లా వాడారంటూ దర్శకుడిపై సినీ ప్రియులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రేమలో పడ్డారంటూ వార్తలు
ఈ సినిమాలో నటించే సమయంలోనే ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో పడ్డారని, నిశ్చితార్థం కూడా జరిగిందంటూ వార్తలు వచ్చాయికానీ వాటిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు. దీంతో అవన్నీ పుకార్లే అంటూ కొట్టేశారు. ఆదిపురుష్ సినిమాతోపాటు బయట కూడా వారిద్దరి కెమిస్ట్రీ బాగుండటంతో అందరూ పెళ్లిచేసుకోబోతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. అయితే అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని పరోక్షంగా ప్రభాస్ ఇటీవలే ఓ హింట్ ఇచ్చారు. దీంతో డార్లింగ్ అభిమానులంతా నిరాశకు గురవుతున్నారు. కృతి సనన్ మాత్రం ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి.

మోడల్ గా కెరీర్ ప్రారంభం
మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కృతి సనన్ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. దశాబ్దం క్రితం తెలుగులో మహేష్ బాబు కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించిందికానీ అది ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. హిందీలో మాత్రం నిలదొక్కకొని స్టార్ హీరోయిన్ గా మారింది. త్వరలోనే కార్తీక్ ఆర్యన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే అధికారికంగా వారి నుంచి వార్త రావాలి. అవునా? కాదా? అనేది తెలియాలి. ప్రస్తుతం కెరీర్ పరంగా చక్కటి ప్రణాళిక రచించుకొని సినిమాలు చేస్తోంది కృతి సనన్. స్టార్ హీరోలకు దీపికా పదుకొనే తర్వాత సెకండ్ ఆప్షన్ గా కృతి ఉంది.












Click it and Unblock the Notifications