41 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్..తండ్రి ఎవరంటే...?
హీరోయిన్లు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యతను ఇస్తున్నారు. పెళ్లైన హీరోయిన్లు సైతం కెరీర్‌తో పాటు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తుంటే..మరికొందరు తల్లులుగా మారిన తరువాత కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియ భట్ పెళ్లైన వెంటనే గర్భవతి అయింది. బిడ్డను కన్న తరువాత కూడా అలియా భట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తమిళ స్టార్ హీరోయిన్ నయనతార సైతం ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన తరువాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మరో స్టార్ హీరోయిన్‌గా తల్లిగా మారబోతుంది. హీరోయిన్ ఆర్తి చాబ్రియా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి చాబ్రియా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి గోడ మీద పిల్లి వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే ఆమె నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆర్తి చాబ్రియాకు పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు నటించినప్పటికీ కూడా అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది.
దీంతో 2019లో పెళ్లీ పీటలెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారదన్ బీడస్సిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. సినిమాలకు పూర్తిగా దూరం ఉంటున్న ఆర్తి చాబ్రియా కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. తాజాగా అమ్మడు తాను తల్లి కాబోతున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. నా జీవితంలో అత్యంత అందమైన నిజ జీవిత పాత్రపై దృష్టి సారించి ఉత్తమ నెలలను ఆస్వాదిస్తున్నాను అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఆర్తి చాబ్రియా తల్లి కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications