సౌత్‌ఆఫ్రికా క్రికెట్‌ను తాకిన 'పుష్ప-2' మ్యానియా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2' సినీ యావత్తు మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. 'పుష్ప-2'తో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ కోసం నేషన్‌వైడ్‌గా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Hey everyone! I have some exciting news for all the movie buffs out there. 🎥💥
— AB de Villiers (@ABdeVilliers17) December 2, 2024
The first 10,000 depositors who deposit INR 100 or more on @Wolf7Pay will get tickets to the year’s biggest blockbuster – Pushpa 2! 🔥
Don’t wait – campaign ends this Saturday. Play responsibly and… pic.twitter.com/QRqEOAUGbt
ఇక పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో 'పుష్ప-2' హవా కొనసాగుతోంది. తాజాగా సౌత్‌ఆఫ్రికా క్రికెట్‌కు సైతం 'పుష్ప-2' మ్యానియా తాకింది. పుష్ప-2 టికెట్ల గురించి సౌత్‌ఆఫ్రికా స్థార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ఏబీ డివిలియర్స్ 'పుష్ప 2' టికెట్లు ఇస్తానంటూ ప్రకటించాడు.ఆన్ లైన్ గేమింగ్ పోర్టల్ అయిన Wolf7payలో వంద లేదా అంతకు మించి డిపాజిట్ చేసి ఆట ఆడిన మొదటి 10,000 మందిలో కొందరిని ఎంపిక చేసి 'పుష్ప 2' సినిమా టికెట్లు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. ఈ ఏడాదిలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ టికెట్లు పొందాలంటే వెంటనే Wolf7payలో లాగిన్ కావాలంటూ డివిలియర్స్ పిలుపునిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications