అలాంటి విడాకులు కావాలి..బాంబు పేల్చిన ప్రముఖ హీరోయిన్

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.

భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

Abhirami Suresh interesting comments on marriage life

తాజాగా ప్రముఖ నటి విడాకులు గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ నటి అభిరామి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ ప్రేక్షకులకు ఈ భామ సుపరిచితమే. అభిరామి సురేష్‌ సోదరి అమృత సురేష్‌కు సింగర్‌గా మంచి గుర్తింపు ఉంది. తన సోదరి విడాకులు తీసుకోవడంతో ఈ భామ కీలక వ్యాఖ్యలు చేసింది.అభిరామి సురేష్‌ సోదరి అమృత సురేష్ నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. ఇక వీరికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్తకు విడాకులిచ్చి వేరుగా ఉంటుంది. ఇదే సయయంలో భర్తపై గృహహింస చట్టం కింద జైలుకు కూడా పంపించింది. అలా జైలుకెళ్లిన బాల తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చి ఇటీవలె మూడో వివాహం చేసుకున్నాడు.

సోదరి భర్త మరో పెళ్లిపై అభిరామి సురేష్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. అభిరామి సురేష్ తాజాగా ఓ ఇంటర్య్వూలో స్పందించారు.నేను విడాకులు లేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. అందుకు కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు.. కానీ మా అక్క జీవితంలో పడ్డ కష్టాలు చూసిన తర్వాత నాకు పెళ్లంటేనే భయంగా ఉంది. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ భయమే. అది ఏదో ఒకరోజు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మనం సరైన వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోతే పర్వాలేదు.. కానీ ప్రమాదకరమైన వారితో ప్రేమలో పడిపోతేనే మరింత భయం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+