కూతురు బర్త్‌ డేకు దూరంగా అభిషేక్ బచ్చన్‌..షాకిచ్చిన ఐశర్వరాయ్

బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడంతో మరోసారి అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తెర మీదకు వచ్చాయి.

Abhishek Bachchan did not attend daughter Aaradhya birthday celebrations

ఇటీవల వీరిద్దరు కలిసున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. కూతురిలో వీరిద్దరు దుబాయ్ వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో విడాకుల రూమర్లకు ఈ జంట చెక్ పెట్టినట్టు అయింది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆరాధ్య పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోలను ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆరాధ్య బచ్చన్ రీసెంట్‌గా 13వ ఏట అడుగుపెట్టడంతో యువర్ అఫిషియల్లీ టీనేజర్ ఆరాధ్య అంటూ పోస్టర్ పెట్టి మరీ కూతురికి అల్లారు ముద్దుగా ట్రీట్ ఇచ్చింది.

ఈ ఫొటోల్లో కూతురు ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ మాత్రమే ఉన్నారు. ఈ ఫొటోల్లో ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. అభిషేక్ రాకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో కూతురు బర్త్ డే వేడుకలను నిర్వహించి భర్తకు గట్టి షాకే ఇచ్చింది. ఇటు బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ హాజరుకాలేదు.దీంతో తల్లి మాత్రమే ఉండటంతో ఫ్రేమ్‌లో తండ్రి అభిషేక్ బచ్చన్ మిస్సింగ్ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.ఐష్-అభిషేక్ విడాకులు కన్ఫామేనా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ నుంచి ఐష్ విడాకులు తీసుకుంటోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఏ ఫంక్షన్, పార్టీలు వెళ్లినా కేవలం ఐష్, ఆరాధ్య మాత్రమే విడిగా వెళ్తున్నారు. అభిషేక్ బచ్చన్ సింగిల్ గావెళ్లడంతో పుకార్లు కాదు నిజంగానే విడిపోతున్నారని దుమారం చెలరేగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+