ఐశ్వర్యరాయ్‌తో రెండో సంతానం కనడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆరాధ్య పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోలను ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆరాధ్య బచ్చన్ రీసెంట్‌గా 13వ ఏట అడుగుపెట్టడంతో యువర్ అఫిషియల్లీ టీనేజర్ ఆరాధ్య అంటూ పోస్టర్ పెట్టి మరీ కూతురికి అల్లారు ముద్దుగా ట్రీట్ ఇచ్చింది.

ఈ ఫొటోల్లో కూతురు ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ మాత్రమే ఉన్నారు. ఈ ఫొటోల్లో ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. అభిషేక్ రాకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో కూతురు బర్త్ డే వేడుకలను నిర్వహించి భర్తకు గట్టి షాకే ఇచ్చింది. ఇటు బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ హాజరుకాలేదు.దీంతో తల్లి మాత్రమే ఉండటంతో ఫ్రేమ్‌లో తండ్రి అభిషేక్ బచ్చన్ మిస్సింగ్ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.తాజాగా పబ్లిక్ ప్లేస్‌లో అభిషేక్ బచ్చన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది.
బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ నిర్వహిస్తోన్న ఓ టాక్ షోలో అభిషేక్ బచ్చన్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్యతో రెండో సంతానం గురించి అభిషేక్ బచ్చన్‌ను రితేశ్ దేశ్‌ముఖ్ ప్రశ్నించారు.ఆరాధ్య తర్వాత ఏంటి..? అని నటుడు రితేష్ అడిగాడు. దీనికి అభిషేక్ బదులిస్తూ.. నేను మీకంటే పెద్దవాడిని ఇలాంటి క్వశ్చన్స్ అందరి ముందు అడగటం సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications