సర్దార్ -2 షూటింగ్‌లో ప్రమాదం...స్టంట్ మ్యాన్ మృతి..మరో ఇద్దరికీ గాయాలు..
కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 చిత్రం షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్టంట్ మ్యాన్ ఎజుమలై మృతిచెందగా, మరో ఇద్దరు స్టంట్‌మ్యాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తమిళనాడు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయ్యే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక, ఈ మూవీ చివరిలో సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. సుమారు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాకు కొనసాగింపుగా సర్దార్ -2 షూటింగ్‌ను దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇటీవలే ప్రారంభించాడు.
వివరాల మేరకు.. ఇటీవలే ప్రారంభమైన కార్తీ సర్దార్ -2 షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. నటుడు కార్తీతో కలిసి యాక్షన్ సీన్స్ తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ తీస్తుండగా స్టంట్ మ్యాన్ ఎజుమలై సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. దీంతో మూవీ యూనిట్ హుటాహుటిన స్టంట్ మ్యాన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఎజుమలై మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. అయితే, ఎజుమలైతో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్ లకు కూడా తీవ్ర గాయాలుయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నటుడు కార్తీ షూటింగ్ స్పాట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

సంతాపం ప్రకటించిన సినీపరిశ్రమ..
ఇటీవలి కాలంలో సినిమా షూటింగ్ సమయాల్లో ప్రమాదాలు ఎక్కువయిపోయాయి. గతంలో భారతీయుడు -2 షూటింగ్ సమయంలో కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫైట్ మాస్టర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న టాలీవుడ్‌లో కూడా ఓ ప్రమాదం జరిగింది. జూనీయర్ ఎన్‌టిఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రం షూటింగ్‌లో కూడా ప్రమాదం చోటుచేసుకుంది. దేవర చిత్రీకరణ సమయంలో తేనెటీగల దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా, కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్2 షూటింగ్‌లో ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో స్టంట్ మ్యాన్ మృతిచెందడంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్ మ్యాన్ ఎజుమలై మృతి పట్ల తమిళనాడు సినీ పరిశ్రమ, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications