ఆ హీరో పబ్లిక్‌లో బలవంతంగా కిస్ చేశాడు ..స్టార్ హీరోయిన్
ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే.హీరోలతో పోలిస్తే.. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు..కానీ గతంలో ఇలాంటి ఏమీ లేవు.
అప్పటి హీరోయిన్లు గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు చెప్పడం చర్చనీయంశంగా మారింది. అలనాటి నటి జయలలిత ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తెలుగులో టాప్ హీరోగా వెలుగుతున్న అతను అర్థరాత్రి దాగి వచ్చి డోర్స్ కొట్టేవాడని తెలిపింది. ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ కొందరి చేతుల్లో నేను నలిగిపోయానంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ కూడా గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది. రేఖ ''అంజనా'' అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన కన్నా 20 ఏళ్లు పెద్దైన బిస్వజిత్ చటర్జీ సరసన హీరోయిన్‌గా నటించింది రేఖ. అప్పట్లో ముద్దు సన్నివేశాలను ఆకులు చాటునో లేదా, చెట్ల చాటునో తీయడం జరిగేది.
కానీ రేఖ నటించిన తొలి సినిమాలో కొత్తగా ప్రయత్నిద్దామని హీరోతో రేఖకు నేరుగా ముద్దు పెట్టించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. అయితే రేఖకు హీరో బిస్వజిత్ చటర్జీ బలవతంగా ముద్దు పెట్టుకున్నాడట. రేఖను పట్టుకుని ఊపిరాడకుండా బిస్వజిత్ చటర్జీ కిస్ చేశాడట.దీంతో రేఖ గట్టిగా అరిచి ఏడ్చిందట. రేఖను బిస్వజిత్ చటర్జీ బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్నా ఆయన్ను ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదంట. పైగా చప్పట్లు, విజిల్స్ వేస్తూ హీరోను మరింత ఎంకరేజ్ చేశారట. ఈ విషయం రేఖను మరింత బాధపెట్టింది. దీనిపై రేఖ కోర్టుకు కూడా వెళ్లింది. బిస్వజిత్ చటర్జీ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసిపోయింది.












Click it and Unblock the Notifications