యాంకర్ సుమను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్న నటుడు (వీడియో)
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో సుమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కేరళ అమ్మాయి అయినప్పటికి, తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చేసేది ఏ షో అయినా, అక్కడున్నది స్టార్ హీరోనైనా అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేయడంలో సుమ సిద్ధహస్తురాలు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్‌ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా తన సత్తాను కొనసాగిస్తుంది.
ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలందరికి కూడా బెస్ట్ యాంకర్‌గా సుమ నిలిచిపోయారంటే ...ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యంగ్ హీరోలు సైతం సుమను అభిమానిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సమయంలో మాట్లాడుతూ.. సుమ ఉంటే ఆ ఈవెంట్ సక్సెస్ అయినట్టే అని, నటులను కంఫర్ట్ జోన్‌లో ఉండేలా చూడటంలో ఆమె తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ చేశారు. యాంకర్ సుమ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పంచ్‌లు వేయడమే కాదు, ఎదుటివాళ్లు వేసే పంచ్‌లకు రివర్స్ కౌంటర్ ఇస్తుంటారు.

ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. అలాంటి సుమను ఓ నటుడు ఇబ్బందికర పరిస్ధితుల్లోకి నెట్టాడు. ఓ తమిళ నటుడు స్టేజ్‌పైనే ఏకంగా సుమను ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు విక్రమ్‌తో పాటు పలువురు సినీ నటులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా తమిళ నటుడు డేనియల్ కాల్టగిరోన్‌ను స్టేజ్ మీదకు పిలిచి, అతనితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది సుమ.
యాంకర్ సుమను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్న నటుడు..!#AnchorSuma #SumaKanakala #Thangalaan #ChiyaanVikram #ViralVideo #Oneindiatelugu pic.twitter.com/Trdygfu5lE
— oneindiatelugu (@oneindiatelugu) August 5, 2024
ఇక్కడున్న అమ్మాయిల్లో సుమనే అందంగా ఉందని డేనియల్ కాల్టగిరోన్‌తో అనిపించింది. ఆ లైన్ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. కానీ డేనియల్.. ఆమె చేతికి ముద్దు పెట్టడంతో సుమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే తెరుకున్న సుమ ఈ ఘటనను స్పోర్టివ్‌నెస్‌గా తీసుకుంది. ఓరి నాయనో.. రాజా, ఈయన మా అన్నయ్య.. రాఖీ పండగ వస్తోంది అంటూ కవర్ చేసి.. అన్నయ్య సన్నిధి.. అని పాట పాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications