ఫిష్ వెంకట్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జూలై 12 రాత్రి హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టాల్లో ఉండడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
సినీ జర్నీ..
ఫిష్ వెంకట్ 'ఆది' నుంచి 'కాఫీ విత్ ఏ కిల్లర్' వరకు వందకు పైగా చిత్రాల్లో నటించారు. దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, చెన్నకేశవరెడ్డి, డీజే టిల్లు, కింగ్, దరువు, సుప్రీమ్, మిరపకాయ్ వంటి అనేక హిట్ చిత్రాల్లో కామెడీ విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా "తొడకొట్టు చిన్నా" అనే డైలాగ్‌తో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కామెడీకి విలనిజాన్ని జోడిస్తూ.. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే కెరీర్ పీక్‌లో ఉన్నపుడే షుగర్, కిడ్నీ సమస్యలు, కాలుకు ఇన్‌ఫెక్షన్ వంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. నాలుగేళ్ల క్రితం జరిగిన శస్త్రచికిత్స తర్వాత కొంతకాలం కోలుకున్నా, సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో బోడుప్పల్‌లోని ఆసుపత్రిలో డయాలసిస్‌కు చేర్పించారు. ఆ క్రమంలోనే పలువురు ప్రముఖులు వారికి అండగా నిలిచారు. కానీ పరిస్థితి విషమించి వెంకట్ మృతి చెందారు.
రోజుకు రూ.30,000 రెమ్యూనరేషన్... కానీ?
వెంకట్ నటనకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, రెమ్యూనరేషన్ మాత్రం చాలా తక్కువగా ఉండేదని సన్నిహితులు చెబుతున్నారు. ఒక్కో సినిమా కోసం ఎక్కువగా రూ. 30,000 మాత్రమే తీసుకునేవారని, కెరీర్ ప్రారంభంలో అయితే రోజుకు రూ.2,000 నుంచి మొదలైందని పేర్కొన్నారు. ఈ రెమ్యూనరేషన్ కుటుంబ అవసరాలకు సరిపోవచ్చు గానీ, ఈ స్థాయిలో ఉన్న ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించాలంటే మాత్రం చాలడం కష్టమేనని అంటున్నారు.
వెంకట్ భార్య మాట్లాడుతూ.. ఆపరేషన్ తర్వాత మద్యం, ధూమపానం మానేయమన్నాం. కానీ వినలేదు. కొంతమంది స్నేహితులే ఇంటికొచ్చి మళ్లీ అలవాటు పెట్టించారు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా, చూసేందుకు ఎవ్వరూ రాలేదు. కుటుంబం ఒంటరిగా పోరాడింది" అంటూ బాధ వ్యక్తం చేశారు. వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన కళాకారుడు చివరకు ఆర్థిక సహాయానికి ఎదురుచూస్తూ..చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !!












Click it and Unblock the Notifications