సినిమాల్లో సీమ నెటివిటీని సరిగ్గా చెప్పలేదు.. "నవాబుపేట దేవర"పై డాక్యుమెంటరీ !!
రాయలసీమ నేపథ్యంతో సినిమాలు చేసి చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప పేరు తెచ్చుకున్నారు.. కానీ రాయలసీమ దర్శకులు మన కథల్ని తెరకెక్కించి ఆ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోతున్నారని ప్రముఖ నటుడు మహేశ్ విట్టా వ్యాఖ్యానించారు. ఇంతవరకు రాయలసీమ నెటివిటీని సరిగ్గా చెప్పిన సినిమా రాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఘనంగా జరిపే "నవాబుపేట దేవర" పండుగపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ ప్రీమియర్ షోని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఈ మేరకు మహేష్ మాట్లాడుతూ.. రాయలసీమలో దేవర పండుగను ఇలాగే జరుపుతారని తెలిపారు. డైరెక్టర్ మురళీ దర్శకత్వంలో "నవాబుపేట దేవర" డాక్యుమెంటరీని అద్బుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. ఈ డాక్యుమెంటరీని బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ నిర్మించడం మంచి విషయం అన్నారు. గతంలో ఆయన డైరెక్షన్ లో "పొద్దుటూరు దసరా" చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోందని చెప్పారు. దేవర పండుగ బ్యాక్ డ్రాప్ తో మురళీ సినిమా చేయాలని కోరుకుంటున్నా అని మనసులో మాట బయటపెట్టారు.

అలానే ఈ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి దేవర పండుగ జరిపే విధానం చూసేవాడినన్నారు. ఈ నేపథ్యంతో డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుంది అనిపించి మురళీని అప్రోచ్ అయ్యానని వివరించారు. నవాబుపేట దేవర డాక్యుమెంటరీ ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ మాట్లాడుతూ - నవాబుపేట దేవర డాక్యుమెంటరీ క్వాలిటీగా వచ్చిందంటే అందుకు కారణం టీమ్ అందరి సపోర్ట్ అని చెప్పారు. లేకుంటే 32 గంటల్లో డాక్యుమెంటరీ పూర్తి అయ్యేది కాదని.. ఆనంద్ మ్యూజిక్, నాగేంద్ర లిరిక్స్ తో పాటు విజువల్స్ ఆకట్టుకుంటాయని స్పష్టం చేశారు.
ప్రతి వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కథలు, కొత్త ప్రయోగాలు, కొత్త జానర్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. బలమైన కథాంశం, మౌత్ టాక్ (Mouth Talk) ద్వారా చిన్న చిత్రాలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రీసెంట్ గా తెలుగులో వచ్చిన పలు సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించి ఈ విషయాన్ని నిరూపించాయి. టెక్నాలజీ, VFX, కెమెరా క్వాలిటీ, కథ చెప్పే పద్ధతులు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు డాక్యుమెంటరీలు కూడా మంచిగా సక్సెస్ అవుతాయని భావిస్తున్నారు.

-
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications