రవితేజ విలన్ ఆకస్మిక మరణం

చిత్ర పరిశ్రమ మరో మంచి టాలెంటెడ్ నటుడిని కోల్పోయింది. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న ముకుల్ దేవ్ 54 ఏళ్ల చిన్న వయసులోనే తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, శుక్రవారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ సోదరుడైన ముకుల్ దేవ్, తన కెరీర్‌ను సీరియల్ నటుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'దస్తక్' సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ముకుల్, తెలుగులో రవితేజ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణ' సినిమాలో విలన్‌గా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Actor Mukul Dev passes away

ఆ తర్వాత తెలుగులో 'సిద్ధం', 'కేడీ', 'అదుర్స్', 'ఏక్ నిరంజన్', 'బెజవాడ', 'మనీ మనీ మోర్ మనీ' వంటి పలు చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేశారు. చివరిగా ఆయన 'అంత్ ది ఎండ్' సినిమాలో కనిపించారు. ఈ సినిమా తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి, నిన్న రాత్రి కన్నుమూశారు.

ముకుల్ దేవ్ ఆకస్మిక మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+