పవిత్రా లోకేష్‌పై నరేష్ సంచలన వ్యాఖ్యలు

క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటకలో.. ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో కరోనా తర్వాత అంత పాపులరైనవారు ఎవరైనా ఉన్నారా అంటే వారు పవిత్రా లోకేష్ - నరేష్ జంట అని చెప్పొచ్చు. వీరిద్దరి ప్రేమ అంతగా సమాజాన్ని ప్రభావితం చేసింది. నరేష్ అంటే పవిత్రా లోకేష్, పవిత్రా లోకేష్ అంటే నరేష్ గా మారిపోయారు.

ప్రేమ ఎప్పుడు పుడుతుంది?
ప్రేమ ఎప్పుడు పుడుతుంది? అనేదానికి సృష్టిలో సమాధానం లేదు. అలా నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమలో పడ్డారు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసిందే. మూడోభార్య గొడవ చేయడం.. వివాదాస్పదం కావడం అన్నీ వార్తల్లో నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. తనకు, మహేష్ బాబుకు ఉన్న బాండింగ్ గురించి, అలాగే ప్రిన్స్ తీసుకునే ఇష్టమైన ఆహారం గురించి చెప్పారు. ఆ తర్వాత పవిత్రా లోకేష్ గురించి మాట్లాడారు.

actor naresh comments on pavitra lokesh character

ప్రకృతి కలిపింది
పవిత్ర లోకేష్ ది, తన అమ్మగారు విజయనిర్మలది పుట్టినరోజు ఒకేరోజు అని చెప్పారు. ప్రకృతి మమ్మల్ని అలా కలిపిందని, దేవుడు అలా సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు. పవిత్రాలోకేష్ చాలా మంచిదని, అమ్మ విజయనిర్మలలా స్ట్రాంగ్ ఉమెన్ అని , అమ్మ చివరి రోజుల్లో తన గురించి ఎంతో బాధపడిందని, ఆ సమయంలో తాను పవిత్ర గురించి అమ్మకు చెప్పానని నరేష్ వివరించారు. అమ్మా.. బాధపడకు.. నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది అని చెప్పాను.. అలా చెప్పడంవల్ల అమ్మ కొంత స్థిమితపడింది అంటూ నరేష్ వివరించారు.

నరేష్ వద్ద రూ.1500 కోట్ల ఆస్తి ఉందని, అందుకే అతడితో రిలేషన్ షిప్ మొదలు పెట్టిందని, అతడి వయసు 60 ఏళ్ళ పైబడి ఉన్నప్పటికీ పవిత్ర అతడిని భర్తగా అంగీకరించడానికి కారణం డబ్బు అంటూ ఆమె మాజీ భర్త ఆరోపణలు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+