ఓవర్ చెయ్యకు రోయ్: పవన్ కల్యాణ్ దర్శకుడికి మాస్ మహారాజా వార్నింగ్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉందీ మూవీ.

జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్యం రాజేష్, ఝాన్సీ, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. 2018లో విడుదల అయిన బాలీవుడ్‌ సూపర్ హిట్ మూవీ రెయిడ్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్ర నటించిన రెయిడ్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది అప్పట్లో. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ అయింది.

Actor Ravi Teja reacts against the tweet posted by the Director Harish Shankar

మొన్నటివరకు హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రం యూనిట్. పాటలను తెరకెక్కించింది. అక్కడి షెడ్యూల్‌ను ముగించుకుని హైదరాబాద్‌కు చేరింది యూనిట్. తరువాతి షెడ్యూల్‌లో సిటీలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. త్వరలోనే షూటింగ్‌ను ర్యాప్ అవుట్ చేయాలని నిర్ణయించింది.

హిమాచల్ ప్రదేశ్‌లో చిత్రీకరణను ముగించుకుని హైదరాబాద్‌లో ల్యాండ్ అయినట్లు వెల్లడించాడు దర్శకుడు హరీష్ శంకర్. రవితేజకు చెందిన ఓ ఎనర్జిటిక్ లుక్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఓ ఫన్నీ కామెంట్‌ను దానికి జత చేశాడు.

ప్రపంచకంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్య కి తప్ప !!! అంటూ ట్వీట్ పెట్టాడు. దీనికి ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అయ్యాడు రవితేజ. ఓవర్ చెయ్యకు రోయ్.. నీ దిష్టే తగిలాలా ఉంది.. అంటూ తన దైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. వారిద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+