Video:చీరకట్టు ముద్దు..అలా కనిపించే బట్టలు వద్దు - శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన నటించిన 'దండోరా' చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే శివాజీ, ఈ వేదికపై హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగింది?
దండోర ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా శివాజీ మాట్లాడుతూ, నేటి తరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "హీరోయిన్లు చీరల్లో చాలా అందంగా, నిండుగా కనిపిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు శరీరం ప్రదర్శించేలా, సామాన్లు కనిపించేలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు. అటువంటి వస్త్రధారణ అస్సలు బాలేదు" అని వ్యాఖ్యానించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చీరకట్టులో ఉండే గొప్పతనాన్ని వివరిస్తూనే, గ్లామర్ పేరుతో హద్దులు దాటవద్దని ఆయన సూచించారు.

actor-sivaji-controversial-comments-on-heroines-clothes-at-dandora-event

సోషల్ మీడియాలో విమర్శలు - మద్దతు
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.శివాజీ చెప్పింది నిజమేనని, సంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే నటీమణులు గౌరవంగా ఉంటారని కొందరు సమర్థిస్తున్నారు. పద్ధతిగా ఉండాలని చెప్పడంలో తప్పేముందని ఆయనకు అండగా నిలుస్తున్నారు.మరో వైపు దుస్తులనేవి వ్యక్తిగత ఇష్టమని, ఒకరి వస్త్రధారణను విమర్శించే హక్కు ఎవరికీ లేదని మరికొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా 'సామాన్లు' అనే పదాన్ని వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన పదజాలం వాడాలని సూచిస్తున్నారు.

సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శివాజీ కోర్టు చిత్రం ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అందులో ఆయన చేసిన మంగపతి క్యారెక్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో నటన ఇరగదీశాడంటూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత శివాజీకి సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే తాను చేసిన క్యారెక్టర్‌ కంటే కూడా తాను బహిరంగ వేదికలపై మాట్లాడే మాటలు,వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు.

గతంలోనూ వివాదాలు
శివాజీ గతంలోనూ రాజకీయ సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు నేరుగా తోటి నటీమణుల దుస్తుల గురించి కామెంట్స్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) లేదా ఇతర నటీమణులు ఎలా స్పందిస్తారో చూడాలి.సినిమా ప్రమోషన్ కోసం జరిగిన ఈ వేడుక, శివాజీ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'దండోరా' సినిమా కంటే ఈ వివాదమే ఎక్కువగా ఫోకస్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+